కర్నూలు ఎస్పీ కీలక సూచనలు

0చూసినవారు
కర్నూలు ఎస్పీ కీలక సూచనలు
బస్సు ప్రయాణాల సమయంలో మహిళలు బంగారు ఆభరణాలు ధరించి నిర్లక్ష్యంగా ఉండొద్దని ఎస్పీ విక్రాంత్ పాటిల్ హెచ్చరించారు. రద్దీని అదునుగా చూసుకుని దొంగలు ఆభరణాలు, బ్యాగులు అపహరిస్తున్నారని తెలిపారు. అపరిచితులను నమ్మవద్దని, తెలియని వారి నుంచి ఆహారం తీసుకోవద్దని సూచించారు. అనుమానితులు కనిపిస్తే వెంటనే 112 లేదా 100కు సమాచారం ఇవ్వాలని కోరారు. ప్రయాణికుల భద్రతకు పోలీసు యంత్రాంగం ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉంటుందని ఆయన హామీ ఇచ్చారు.

సంబంధిత పోస్ట్