కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ శనివారం మున్సిపల్ ఉద్యోగుల కోసం ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో క్రీడా పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, క్రీడల్లో పాల్గొనడం వల్ల ఉద్యోగుల్లో మానసిక ఒత్తిడి తగ్గి, ఉత్సాహం, సానుకూల దృక్పథం పెరుగుతుందని అన్నారు. విధుల ఒత్తిడికి దూరంగా క్రీడల్లో పాల్గొనడం ద్వారా ఉద్యోగుల్లో మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వం పెరుగుతుందని, క్రీడలు ఉద్యోగుల్లో సమన్వయం, పరస్పర సహకారం, ఐక్యతను మరింత బలోపేతం చేస్తాయని పేర్కొన్నారు.