ఐపీఎల్‌లో ఆర్సీబీ జట్టు విజయం అనంతరం కర్నూలు నగరంలో జరిగిన ఆస్తుల ధ్వంసం ఘటనలపై యువతకు అవగాహన కల్పించేందుకు సెయింట్ జోసెఫ్ డిగ్రీ కళాశాలలో ప్రత్యేక కౌన్సెలింగ్ నిర్వహించారు. బుధవారం జరిగిన ఈ కార్యక్రమంలో సైకాలజిస్ట్ సుధీర్ సండ్ర మాట్లాడుతూ, అభిమాన జట్టు గెలిచినప్పుడు ఆనందం సహజమేనని, అయితే గుంపు ప్రభావంతో చట్టవ్యతిరేక చర్యలకు పాల్పడకూడదని, క్షణికావేశంలో చేసే తప్పులు భవిష్యత్తుపై ప్రభావం చూపుతాయని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో టూ టౌన్ సీఐ శ్రీధర్, పోలీసు సిబ్బంది, కళాశాల యాజమాన్యం పాల్గొన్నారు.