కర్నూలు: చంద్రబాబుతోనే రాష్ట్రాభివృద్ధి: సోమిశెట్టి

6చూసినవారు
రాష్ట్ర అభివృద్ధి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నాయకత్వంలోనే సాధ్యమని కుడా చైర్మన్ సోమిశెట్టి వెంకటేశ్వర్లు అన్నారు. ఆదివారం కర్నూలులోని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడు బిజినెస్ రిఫార్మర్ ఆఫ్ ది ఇయర్ అవార్డును కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ చేతుల మీదుగా అందుకోవడం తెలుగు ప్రజలకు గర్వకారణమని పేర్కొన్నారు. రాష్ట్రాన్ని వచ్చే ఐదేళ్లలో దేశంలోనే నంబర్ వన్ స్థానానికి తీసుకెళ్లేందుకు కూటమి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు.

ట్యాగ్స్ :