ఈనెల 4న తిరుపతిలో నిర్వహించనున్న హలో బీసీ. చలో తిరుపతి మహాసభను విజయవంతం చేయాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నాగేశ్వరరావు యాదవ్ పిలుపునిచ్చారు. సోమవారం కర్నూలు బీసీ భవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో, బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్, ప్రత్యేక రక్షణ చట్టం, మహిళా బిల్లులో ప్రత్యేక కేటాయింపులు, కేంద్రంలో కీలక శాఖలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బీసీల హక్కులు, రిజర్వేషన్ల పరిరక్షణ కోసం రాష్ట్రవ్యాప్తంగా చర్చ ప్రారంభించాలనే ఉద్దేశంతో ఈ సమావేశాన్ని భారీస్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.