ఐక్యరాజ్య సమితి 2025-26ను అంతర్జాతీయ సహకార సంవత్సరంగా ప్రకటించిన సందర్భంగా శనివారం కర్నూలు జిల్లా సహకార కేంద్ర బ్యాంకులో పతాకావిష్కరణ జరిగింది. బ్యాంకు ఛైర్మన్ డి. విష్ణువర్థన్ రెడ్డి పతాకావిష్కరించారు. సహకార బ్యాంకుల సిబ్బంది అందరు కూడా అంకిత భావంతో పనిచేసి సహకార వ్యవస్థను బలోపేతం చేస్తూ రైతులకు సేవలు అందించాలని చైర్మన్ విష్ణువర్ధన్ రెడ్డి అన్నారు. జిల్లా సహకార అధికారి, నాబార్డు సిబ్బంది ఉన్నారు.