రానున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలని కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశించారు. శుక్రవారం కర్నూలులోని జిల్లా పోలీసు కార్యాలయంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్‌ఐలతో నిర్వహించిన నేర సమీక్ష సమావేశంలో క్రైమ్ రేట్ తగ్గించడం, ప్రాపర్టీ రికవరీలు పెంచడం, డ్రంకెన్ డ్రైవ్‌లపై ప్రత్యేక డ్రైవ్ చేపట్టడం, గ్రామాల్లో గొడవలు నివారించేందుకు కౌన్సిలింగ్ చేయడం వంటి అంశాలపై సూచనలు చేశారు.