కర్నూలులో జరిగిన గొర్రెల మేకల పెంపకందారుల సంఘం సమావేశంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పూసపాటి వెంకట్రావు మాట్లాడుతూ, గొర్రెల పెంపకందారులకు సబ్సిడీ రుణాలు అందించి వృత్తిని రక్షించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నీరు, మేత, వైద్య సౌకర్యాల కొరతతో పెంపకందారులు ఇబ్బందులు పడుతున్నారని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. గొర్రెల పెంపకం ద్వారా ప్రభుత్వానికి భారీ ఆదాయం వస్తున్నప్పటికీ సంక్షేమానికి తగిన నిధులు కేటాయించడం లేదని విమర్శించారు. ప్రతి గ్రామంలో మేత భూములు కేటాయించి, పావలా వడ్డీ రుణాలు, ఎన్సీడీసీ రుణాలు అందించాలని కోరారు. అనంతరం సంఘం జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు.