బుధవారం కర్నూలు నగరంలోని శ్రీరామనగర్‌లోని వేదాస్ పట్టణ నిరాశ్రయుల వసతి గృహాన్ని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి బి. లీలా వెంకట శేషాద్రి పరిశీలించారు. వసతి, ఆహారం, పరిశుభ్రతను పరిశీలించి, పాడైన రూమ్‌ను రిపేర్ చేయాలని సూచించారు. నిర్వాహకురాలు నిధుల కొరతను తెలియజేయగా, నిధుల మంజూరుకు కృషి చేస్తామని కార్యదర్శి హామీ ఇచ్చారు. వసతి సదుపాయాలు మెరుగుపరచాలని సూచించారు.