కర్నూలు: రజక విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు

4చూసినవారు
కర్నూలు: రజక విద్యార్థులకు ప్రతిభా పురస్కారాలు
ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రజక విద్యార్థుల్లో విద్యా ప్రతిభను ప్రోత్సహించేందుకు ఈ ఏడాది కూడా ప్రతిభా పురస్కారాలు అందజేయనున్నట్లు రజక విద్యా సేవా సమితి వ్యవస్థాపక అధ్యక్షుడు సీపీ వెంకటేష్ తెలిపారు. ఆదివారం కర్నూలు అబ్దుల్లాఖాన్ ఎస్టేట్‌లోని స్కందా బిజినెస్ పార్క్‌లో ఉన్న రజక విద్యా సేవా సమితి కార్యాలయంలో 8వ రజక విద్యార్థుల ప్రతిభా పురస్కారాల కరపత్రాన్ని ఆవిష్కరించారు. కర్నూలు, నంద్యాల జిల్లాలకు చెందిన రజక విద్యార్థులు ఈ పురస్కారాలకు అర్హులని ఆయన పేర్కొన్నారు.