కర్నూలు: 60రోజుల్లో 3. 40 లక్షల టన్నుల చెత్త శుద్ధీకరణ లక్ష్యం

1చూసినవారు
కర్నూలు: 60రోజుల్లో 3. 40 లక్షల టన్నుల చెత్త శుద్ధీకరణ లక్ష్యం
కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు మంగళవారం జొహరపురం, గార్గేయపురం డంప్‌యార్డుల్లో బయోమైనింగ్ పనులను పరిశీలించారు. రానున్న 60 రోజుల్లో కర్నూలు నగరంలో పేరుకుపోయిన చెత్తను పూర్తిగా శుద్ధీకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. జొహరపురం డంప్‌యార్డులోని 40 వేల టన్నుల చెత్తను ఈ నెలాఖరులోగా, గార్గేయపురం డంప్‌యార్డులోని 3 లక్షల టన్నుల చెత్తను వచ్చే నెలాఖరులోగా తొలగించాలని గుత్తేదారులకు ఆదేశించారు. వర్షాకాలం ప్రారంభానికి ముందే ఈ పనులు పూర్తి చేయాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్