కర్నూలు: టీడీపీ హింసాత్మక రాజకీయాలు మానుకోవాలి: ఎస్వీ

1చూసినవారు
కర్నూలు: టీడీపీ హింసాత్మక రాజకీయాలు మానుకోవాలి: ఎస్వీ
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఎస్వీ మోహన్ రెడ్డి శుక్రవారం కర్నూలులోని పార్టీ కార్యాలయంలో మాట్లాడుతూ, టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీపై విమర్శలు చేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. టీడీపీ హింసాత్మక రాజకీయాలకు పాల్పడుతోందని, మాజీ మంత్రులు అంబటి, జోగి రమేష్‌ల ఇళ్లపై దాడులు, పెట్రోలు బాంబులతో దాడి చేయడం వంటి ఘటనలను ప్రస్తావించారు. నంద్యాలలో జెడ్పీటీసీ సభ్యుడు రమేష్, ఆలూరులో ఈరన్న హత్యలను ఉదహరిస్తూ రాష్ట్రంలో శాంతిభద్రతలు క్షీణించాయని విమర్శించారు. కర్నూలులో సతీష్ ఆత్మహత్యతో పాటు పలు దుర్మార్గాలకు టీడీపీనే బాధ్యత వహించాలని ఆయన అన్నారు.

సంబంధిత పోస్ట్