కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్, నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని కార్మికులకు మిఠాయి బాక్సులు అందజేసి శుభాకాంక్షలు తెలిపారు. ప్రజారోగ్యం, ప్రాథమిక అవసరాలను తీర్చడంలో కార్మికుల పాత్ర అమూల్యమని, వారి సంక్షేమానికి సంస్థ ఎప్పుడూ వెనకాడదని ఆయన పేర్కొన్నారు. కార్మికుల అభ్యున్నతికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆయన తెలిపారు.