ప్రతి విద్యార్థి విజయం వెనుక ఉపాధ్యాయుల కృషి కీలకమని కర్నూలు ఎంపీ బస్తిపాటి నాగరాజు తెలిపారు. ఆదివారం కర్నూలులో డిఎస్సీ వ్యాయామ ఉపాధ్యాయులుగా ఉద్యోగాలు పొందిన వారికి సిల్వర్ జూబ్లీ కళాశాలలో నిర్వహించిన విజయోత్సవ సభలో ఆయన మాట్లాడుతూ, నూతన ఉపాధ్యాయులను అభినందించి, నిజాయితీ, సమగ్రతతో పనిచేస్తూ విద్యార్థుల భవిష్యత్తును వెలుగుతో నింపాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల ప్రిన్సిపల్ ఆది నారాయణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.