కర్నూలు: ఐపీఎల్ బెట్టింగ్‌, గంజాయిపై గట్టి నిఘా

6చూసినవారు
కర్నూలు: ఐపీఎల్ బెట్టింగ్‌, గంజాయిపై గట్టి నిఘా
కర్నూలు జిల్లాలో నేర నియంత్రణే ప్రధాన లక్ష్యంగా పనిచేయాలని, ఆదివారం జరిగే ఐపీఎల్ ఫైనల్ మ్యాచ్‌ల నేపథ్యంలో బెట్టింగ్ కార్యకలాపాలపై గట్టి నిఘా ఉంచాలని కర్నూలు జిల్లా ఎస్పీ శ్రీ విక్రాంత్ పాటిల్ పోలీసు అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా పోలీసు కార్యాలయంలోని వ్యాస్ ఆడిటోరియంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్సైులతో నిర్వహించిన నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఎస్పీ మాట్లాడుతూ, జిల్లాలో గంజాయి మరియు ఇతర మత్తు పదార్థాల నిర్మూలనకు డ్రగ్ డిటెక్షన్ కిట్లతో విస్తృత తనిఖీలు నిర్వహించాలని సూచించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్