ఆదివారం మంత్రాలయంలో ఓ ఇంట్లో శుభకార్యానికి వచ్చిన బంధువులు ఆరుగురు తుంగభద్ర నదిని చూడటానికి వెళ్లారు. ఐదేళ్ల చంద్ర నదిలో కొట్టుకుపోతుండగా కాపాడేందుకు ప్రయత్నించిన వడ్ల సతీశ్ (25), రాఘవేంద్ర (25), వడ్ల ధను (22), సంధ్య (21) గల్లంతయ్యారు. అపర్ణ సురక్షితంగా బయటపడగా, ధను మృతదేహాన్ని వెలికితీశారు. ఈ విషాద ఘటనలో మొత్తం ఐదుగురు కొట్టుకుపోయినట్లు తెలుస్తోంది.