ఉద్యోగ్‌నగర్‌లో జరిగిన ఇంటి దొంగతనం కేసును కర్నూలు నాలుగో పట్టణ పోలీసులు బుధవారం ఛేదించారు. బాధితుడు కుటుంబంతో కేదార్‌నాథ్ యాత్రకు వెళ్లిన సమయంలో గుర్తుతెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి సుమారు 13 తులాల బంగారు ఆభరణాలు, నగదును దొంగిలించారు. దర్యాప్తులో తెలంగాణకు చెందిన అబ్దుల్ మతీన్, పాములపాడు మండలం ఎర్రగూడూరుకు చెందిన దేవరశెట్టి శివకృష్ణ నిందితులుగా గుర్తించి, వారిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. నిందితులపై పలు పాత కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.