కర్నూలు జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది. పదో తరగతి బాలిక అదృశ్యం కేసులో విచారణకు వచ్చిన తెలంగాణకు చెందిన కోటేశ్వరరావు (22) పోలీసుల విచారణలో కొట్టారనే మనస్తాపంతో విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. మంగళవారం ఈ ఘటనపై కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.