కర్నూలు: త్వరితగతిన ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేయాలి

14చూసినవారు
కర్నూలు: త్వరితగతిన ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేయాలి
కర్నూలు నియోజకవర్గంలో ఎస్‌ఐఆర్‌ను బూత్ స్థాయిలో ఎలాంటి తప్పుల్లేకుండా పూర్తి చేయాలని రిటర్నింగ్ అధికారి, నగరపాలక కమిషనర్ పి. విశ్వనాథ్ సూచించారు. మంగళవారం నగరపాలక సమావేశ భవనంలో అసిస్టెంట్ ఆర్వోలతో కలిసి బూత్ స్థాయి అధికారులతో సమావేశం నిర్వహించారు. ఎస్‌ఐఆర్ మ్యాపింగ్‌ను బూత్ స్థాయిలో అత్యంత జాగ్రత్తగా పూర్తి చేయాలని బీఎల్‌వోలకు సూచించారు. ప్రతి ఓటర్ వివరాలు, చిరునామా ధృవీకరణ, కుటుంబ సభ్యుల సమాచారం అన్నీ బూత్ యాప్‌లో తప్పనిసరిగా, ఖచ్చితంగా నమోదు కావాలని పేర్కొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్