కర్నూలు: లంచం కేసులో వీఆర్వోకు ఏడేళ్ల జైలుశిక్ష

1చూసినవారు
కర్నూలు: లంచం కేసులో వీఆర్వోకు ఏడేళ్ల జైలుశిక్ష
లంచం తీసుకున్న కేసులో నిందితురాలైన వల్లూరు వీఆర్వో చిత్రాల గంగమ్మకు కర్నూలు ఏసీబీ ప్రత్యేక కోర్టు ఏడేళ్ల జైలుశిక్షతో పాటు రూ. 20 వేల జరిమానా విధించింది. మంగళవారం న్యాయమూర్తి ఎన్. శ్రీవిద్య ఈ తీర్పు వెలువరించారు. పంట నష్టం పరిహారం కోసం రైతు పోలు మల్లికార్జునరెడ్డి దస్త్రాన్ని ముందుకు పంపేందుకు వీఆర్వో రూ. 5 వేల లంచం డిమాండ్ చేయడంతో రైతు ఏసీబీకి ఫిర్యాదు చేశారు. 2018 ఫిబ్రవరి 20న లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకుని కేసు నమోదు చేశారు. విచారణలో నేరం రుజువు కావడంతో కోర్టు శిక్ష విధించింది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్