కర్నూలు జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి మంగళవారం మాట్లాడుతూ, వక్ఫ్, దేవాదాయ భూములు ఆక్రమణలకు గురి కాకుండా రక్షించాల్సిన బాధ్యత రెవెన్యూ అధికారులపై ఉందని స్పష్టం చేశారు. జిల్లాలో ఈ భూముల్లో అక్రమ కట్టడాలు జరగకుండా ఫెన్సింగ్ ఏర్పాటు చేసి, బోర్డులు పెట్టాలని అధికారులను ఆదేశించారు. అలాగే, ఈ భూముల సర్వే నంబర్ల వివరాలను జిల్లా రిజిస్ట్రార్, సబ్ రిజిస్ట్రార్లకు పంపించి, వాటిని నిషేధిత జాబితాలో ఉంచేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ మేరకు కలెక్టరేట్‌లో సంబంధిత శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.