శుక్రవారం కర్నూలు జిల్లా అభివృద్ధిపై సీఎం చంద్రబాబు నాయుడు కీలక సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశంలో జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ రామనాయుడు, భారీ పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్ మంత్రి టిజి భరత్, జిల్లా ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎమ్మెల్యేలు, మంత్రాలయం టీడీపీ ఇంచార్జి ఎన్. రాఘవేంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రతి నియోజకవర్గంలో అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలని, స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారించి, గెలుపే లక్ష్యంగా కలిసి కట్టుగా ముందుకు సాగాలని నాయకులకు సీఎం దిశానిర్దేశం చేశారు.