కర్నూలు: అంగన్వాడీల సమస్యలపై ఆందోళన ఉధృతం చేస్తాం

16చూసినవారు
అంగన్వాడీ టీచర్లు, హెల్పర్లు తమ జీతాలు పెంపు, గ్రాట్యుటీ, హెల్త్ కార్డులు, సెంటర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ శుక్రవారం కర్నూలులో జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని సీఐటీయూ జిల్లా అధ్యక్షురాలు బాలదుర్గమ్మ, ఏఐటీయూసీ అనుబంధ ఏపీ అంగన్వాడీ వర్కర్స్, హెల్పర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి చౌడేశ్వరి హెచ్చరించారు. సీఐటీయూ, ఏఐటీయూసీ నాయకులు, టీచర్లు, హెల్పర్లు పెద్ద సంఖ్యలో ఈ నిరసనలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్