కర్నూలు జిల్లాలో పర్యాటకాన్ని అభివృద్ధి చేయడానికి అన్ని విధాలా కృషి చేస్తామని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ. సిరి పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్ సునయన ఆడిటోరియంలో పర్యాటక శాఖ ఆధ్వర్యంలో ప్రపంచ పర్యాటక దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా రూ. 14 కోట్లతో 5 ప్రాజెక్టులు ప్రతిపాదించినట్టు తెలిపారు. జిల్లాలో అక్షరాస్యత, ప్రకృతి వ్యవసాయం, మహిళాభివృద్ధిపై కూడా దృష్టి సారిస్తున్నామని ఆయన చెప్పారు.