కేరళలో జరిగిన 46వ జాతీయ స్థాయి 5 కిలోమీటర్ల పరుగు పందెంలో కర్నూలుకు చెందిన 85 ఏళ్ల మద్దిలేటి రెడ్డి బంగారు పతకం సాధించి స్ఫూర్తిగా నిలిచారు. ఆయన గెలుపును రాజ్యసభ మాజీ సభ్యుడు టీజీ వెంకటేశ్, జిల్లా రగ్బీ సంఘం అధ్యక్షుడు సురేంద్రతో పాటు పలువురు క్రీడా సంఘాల ప్రతినిధులు ప్రశంసించారు.