కర్నూలు: ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. మహిళ మృతి

2చూసినవారు
కర్నూలు: ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్.. మహిళ మృతి
సి.బెళగల్ మండలం పోలకల్‌లో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. బీసీ కాలనీలో ట్రాక్టర్ అదుపుతప్పి ఇంట్లోకి దూసుకెళ్లింది. ఇంట్లో ఉన్న ఆదోని కౌకుట్ల(48) అనే మహిళను ఢీకొట్టడంతో తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతిచెందారు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. ప్రమాదానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

సంబంధిత పోస్ట్