కర్నూలు నగరంలోని బుధవారపేటలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో బంగి బద్రీనాథ్ (28) అనే యువకుడు మృతిచెందాడు. మున్సిపాల్టీకి చెందిన చెత్త సేకరణ లారీ వేగంగా వచ్చి అతని బైక్‌ను ఢీకొట్టడంతో ఈ ఘోరం జరిగింది. తండ్రిని ప్రభుత్వాసుపత్రి వద్ద దింపి ఇంటికి వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. డిగ్రీ వరకు చదివిన బద్రీనాథ్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ ఘటన స్థానికంగా విషాదాన్ని నింపింది.