కర్నూలు జిల్లా హొళగుంద మండలం సమ్మతగేరి గ్రామానికి చెందిన 65 ఏళ్ల బోయ బెనకప్ప, చిన్నప్పటి నుంచి చెప్పులు లేకుండా నడవడం అలవాటుగా చేసుకున్నారు. ఎండాకాలంలో 43 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ ఆయన కాలినడకనే ప్రయాణిస్తున్నారు. సోమవారం గ్రామం నుంచి 6 కి.మీ దూరంలోని హోళగుందకు కూడా చెప్పులు లేకుండా వెళ్లారు. గతంలో ఉగాది సందర్భంగా శ్రీశైలం వరకు సుమారు 200 కి.మీ నడిచి అందరినీ ఆశ్చర్యపరిచారు.