కర్నూలు జిల్లా మంత్రాలయం తుంగభద్ర నదిలో ఐదుగురు గల్లంతైన ఘటనపై జిల్లా ఇంచార్జి మంత్రి నిమ్మల రామానాయుడు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆదివారం ఘటన వివరాలు తెలుసుకున్న వెంటనే జిల్లా అధికారులతో ఫోన్‌లో మాట్లాడి సహాయక చర్యలపై సమీక్షించారు. గల్లంతైన వారి ఆచూకీ కోసం గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని, మత్స్యకారులు, విపత్తు నిర్వహణ బృందాలతో సమన్వయం చేసుకుని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని మంత్రి నిమ్మల హామీ ఇచ్చారు.