శుక్రవారం కర్నూలులో ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆధ్వర్యంలో కొండారెడ్డి బురుజు వద్ద అధునాతన ట్రాఫిక్ నియంత్రణ బారికేడ్లను ప్రారంభించారు. రహదారి భద్రత, ట్రాఫిక్ క్రమబద్ధీకరణ కోసం సామాజిక దాతల సహకారంతో 80 బారికేడ్లు అమర్చారు. విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు ట్రాఫిక్ నమూనా, లైవ్ డెమో, బైక్ ర్యాలీ నిర్వహించారు. ప్రజలు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని ఎస్పీ విజ్ఞప్తి చేశారు.