కొడుకును చంపి, అస్థిపంజరాన్ని పాతిపెట్టిన తల్లి: హైకోర్టు ఆదేశాలతో సిట్ విచారణలో నిజాలు వెలుగులోకి

3చూసినవారు
కొడుకును చంపి, అస్థిపంజరాన్ని పాతిపెట్టిన తల్లి: హైకోర్టు ఆదేశాలతో సిట్ విచారణలో నిజాలు వెలుగులోకి
కర్నూలు జిల్లా కౌతాళం మండలం బదినేహాలు గ్రామానికి చెందిన వీరేశ్ (17) హత్య కేసులో తల్లి గంగమ్మ, ఆమె వివాహేతర సంబంధం కలిగిన దర్గప్పలే నిందితులని దర్యాప్తులో తేలింది. 2024 నవంబరులో వీరేశ్ తమ సంబంధానికి అడ్డు వస్తున్నాడని భావించి, ఇంట్లోనే కత్తితో హత్య చేసి, మృతదేహాన్ని దుప్పట్లో చుట్టి బైక్‌పై తీసుకెళ్లి సమీప శ్మశానవాటికలో పాతిపెట్టినట్లు పోలీసులు గుర్తించారు. కుమారుడు కనిపించడం లేదని గంగమ్మ ఫిర్యాదు చేసినప్పటికీ, కేసు ఛేదించలేకపోయారు. ప్రభుత్వం నుంచి పరిహారం వస్తుందన్న ఆశతో గంగమ్మ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడంతో, రెండు వారాల్లో నివేదిక సమర్పించాలని డీజీపీని ఆదేశించింది. దీంతో ఏర్పాటు చేసిన సిట్ విచారణలో గంగమ్మ, దర్గప్పలే హత్య చేసినట్లు తేలింది. ఆదివారం జి.హొసళ్లి సమీపంలోని శ్మశానవాటికలో పాతిపెట్టిన అస్థిపంజరాన్ని వెలికితీశారు.