కర్నూలులో 2. 37 లక్షల మందికి రూ. 104 కోట్ల పెన్షన్లు పంపిణీ

1చూసినవారు
కర్నూలులో 2. 37 లక్షల మందికి రూ. 104 కోట్ల పెన్షన్లు పంపిణీ
కర్నూలు జిల్లాలో డిసెంబర్ నెలకు గానూ 2,37,733 మంది లబ్ధిదారులకు రూ. 104.32 కోట్ల ఎన్టీఆర్ భరోసా పెన్షన్లను పంపిణీ చేస్తున్నట్లు కలెక్టర్ డా. ఏ. సిరి తెలిపారు. సోమవారం కర్నూలులోని కృష్ణనగర్‌లో వికలాంగ, వృద్ధాప్య, వితంతువు పెన్షన్లను లబ్ధిదారుల ఇళ్లలోనే అందజేశారు. అనంతరం కలెక్టర్ వారి సమస్యలు, అవసరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ పిడి రమణారెడ్డి పాల్గొన్నారు.