డీఎస్సీ అవకతవకలపై దర్యాప్తు కోరుతూ కలెక్టర్‌కు వినతి

4చూసినవారు
డీఎస్సీ అవకతవకలపై దర్యాప్తు కోరుతూ కలెక్టర్‌కు వినతి
డీఎస్సీ నియామకాల ప్రక్రియలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ, బాధితురాలు షేక్ హసీనాబీతో కలిసి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ యువజన విభాగ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కాటసాని శివ నరసింహారెడ్డి, బుట్టా ప్రతుల్ కర్నూలు జిల్లా కలెక్టర్ ఏ. సిరికి వినతిపత్రం సమర్పించారు. అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని, నియామకాలపై సమగ్ర దర్యాప్తు చేపట్టాలని వారు కోరారు. అనంతరం కలెక్టరేట్ ఎదుట నిరసన చేపట్టి, డీఎస్సీ ప్రక్రియపై సీబీఐ విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

సంబంధిత పోస్ట్