కర్నూలులోని ఒక పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న నలుగురు క్రైమ్ పార్టీ సిబ్బందిపై అవినీతి ఆరోపణలు వెల్లువెత్తాయి. ఇటీవల హైదరాబాద్‌కు చెందిన ఒక వ్యాపారిని చోరీ కేసులో కర్నూలుకు తరలిస్తుండగా మార్గమధ్యంలో అతనితో బేరం కుదుర్చుకొని ఫోన్ పే ద్వారా డబ్బులు తీసుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై ఆ వ్యాపారి తెలంగాణ ప్రజాప్రతినిధుల ద్వారా ఏపీ డీజీపీకి ఫిర్యాదు చేశారు. దీంతో జిల్లా ఉన్నతాధికారులకు చర్యలు తీసుకోవాలని డీజీపీ ఆదేశించినట్లు సమాచారం.