
బిల్డింగ్ కూలి నలుగురు మృతి.. కొనసాగుతున్న సహాయక చర్యలు
దక్షిణ ఢిల్లీలోని సాకేత్ మెట్రో స్టేషన్ సమీపంలో శనివారం సాయంత్రం ఐదంతస్తుల భవనం కూలిపోవడంతో నలుగురు మరణించారు. శిథిలాల కింద చిక్కుకున్న 10 మందిని రక్షించారు. సహాయక చర్యలు 16 గంటలకు పైగా కొనసాగుతున్నాయి. వారాంతం కావడంతో ప్రాణనష్టం తక్కువగా ఉందని స్థానికులు తెలిపారు. భవనంపై అంతస్తులో నిర్మాణ పనులు జరుగుతున్నాయని ఆరోపణలున్నాయి. ఢిల్లీ సీఎం రేఖా గుప్తా సంఘటనా స్థలాన్ని సందర్శించి, అక్రమ నిర్మాణాలపై కఠిన చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన అధికారులపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు.




