అన్న క్యాంటీన్లలో నాణ్యత, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి

1చూసినవారు
అన్న క్యాంటీన్లలో నాణ్యత, పరిశుభ్రతకు ప్రాధాన్యం ఇవ్వాలి
కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ చల్లా ఓబులేసు బుధవారం నగరంలోని అన్న క్యాంటీన్లను పరిశీలించారు. కొండారెడ్డి బురుజు, ముజఫర్ నగర్ రోడ్డులోని క్యాంటీన్లను సందర్శించి, ముజఫర్ నగర్ రోడ్డు క్యాంటీన్లో స్వయంగా అల్పాహారం చేశారు. ఆహార నాణ్యతను పరీక్షించి, సిబ్బందితో పాటు ప్రజారోగ్య అధికారి డాక్టర్ ఎం. రఘుతోనూ అభిప్రాయాలు తెలుసుకున్నారు. సాధారణ ప్రజలతో కలిసి భోజనం చేసి వారి అనుభవాలను అడిగి తెలుసుకున్నారు. క్యాంటీన్ల పరిసరాల పరిశుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను ఆదేశించారు.

ట్యాగ్స్ :