ద్రోణి ప్రభావంతో కర్నూలు జిల్లాలో మంగళవారం పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆంధ్రప్రదేశ్ విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. వర్షం వేళ పిడుగులు పడే ముప్పు ఉన్నందున పొలాల్లో పనిచేసే రైతులు, కూలీలు, గొర్రెల కాపరులు చెట్ల కింద ఉండరాదని అధికారులు సూచించారు.