
రూ.50 పందెం కాసి పెన్ను మింగిన విద్యార్థి.. మూడేళ్ల తర్వాత కడుపునొప్పి!
గుంటూరులో స్నేహితులతో రూ.50 పందెం కాసి పెన్ను మింగిన 9వ తరగతి విద్యార్థి ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మూడు సంవత్సరాల క్రితం జరిగిన ఈ సంఘటన కారణంగా, 16 ఏళ్ల మురళీకృష్ణ అనే ఇంటర్మీడియట్ విద్యార్థికి తీవ్రమైన కడుపునొప్పి రావడంతో విషయం బయటపడింది. ఇటీవల కడుపునొప్పితో బాధపడుతున్న అతడిని తల్లిదండ్రులు గుంటూరు జీజీహెచ్‌కు తరలించగా, సీటీ స్కాన్‌లో కడుపులో పెన్ను ఉన్నట్లు వైద్యులు గుర్తించారు. ఎటువంటి శస్త్రచికిత్స లేకుండానే పెన్నును బయటకు తీయడంతో విద్యార్థి ప్రాణాలు నిలిచాయి.




