కర్నూలు నగరపాలక సంస్థ కమిషనర్ పి. విశ్వనాథ్ ఆదేశాల మేరకు, ఆదివారం నగరంలోని ఖాళీ స్థలాల్లో పిచ్చి మొక్కల తొలగింపునకు రెండో విడత విస్తృత స్వచ్ఛత పనులు చేపట్టారు. శనివారం జరిగిన సమావేశంలో, ఉదయం 7 గంటలకు 4వ పట్టణ పోలీస్ స్టేషన్ వద్ద ప్రత్యేక డ్రైవ్ ప్రారంభమవుతుందని తెలిపారు. 7, 12, 14 శానిటేషన్ డివిజన్లలోని 127 ఖాళీ స్థలాల్లో 15 జెసిబిలతో 100 శాతం పిచ్చి మొక్కలు తొలగించాలని ఆదేశించారు.