కర్నూలులో సోమవారం రిటైర్డ్ అధ్యాపకురాలు ఇందిర ఇంట్లోకి దాహం పేరుతో ప్రవేశించిన దంపతులు ఆమెపై దాడి చేసి నాలుగు బంగారు గాజులు, ఒక బంగారు చైన్, రెండు ఉంగరాలను దోచుకెళ్లారు. భర్త మరణించడంతో ఒంటరిగా నివసిస్తున్న ఇందిర, కుమార్తె అమెరికాలో, కుమారుడు హైదరాబాద్‌లో ఉంటున్నారు. నాలుగో పట్టణ పోలీసులు ఈ ఘటనపై విచారణ చేపట్టారు.