సామాజిక ఉద్యమ మహిళా నేత విజయమ్మ కన్నుమూత

5చూసినవారు
సామాజిక ఉద్యమ మహిళా నేత విజయమ్మ కన్నుమూత
కెవిపీఎస్ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షురాలు డి. విజయమ్మ గురువారం శ్వాస సంబంధిత సమస్యతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కార్డియాక్ అరెస్టుతో మృతి చెందారు. దళితులపై దాడులు, దౌర్జన్యాలు, అంటరానితనానికి వ్యతిరేకంగా జిల్లాలో జరిగిన అనేక ఉద్యమాల్లో ఆమె కీలక పాత్ర పోషించారు. పత్తికొండ, నందవరం, ఆదోని, కోడుమూరు ప్రాంతాల్లో జరిగిన పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొన్నారని కెవిపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండీ ఆనంద్ బాబు తెలిపారు. ఆమె మృతి సామాజిక, ప్రజాతంత్ర ఉద్యమాలకు తీరని లోటని ఆయన పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్