ఆలూరులో తాగునీటి సమస్య పరిష్కారమే తొలి ప్రాధాన్యత: వెంకప్ప

6చూసినవారు
ఆలూరు నియోజకవర్గంలో తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరించడమే తమ మొదటి ప్రాధాన్యత అని జనసేన పార్టీ ఇంచార్జ్ తెర్నేకల్ వెంకప్ప తెలిపారు. ఆరు మండలాల్లోని 166 గ్రామాలకు ప్రతి ఇంటికీ తాగునీరు అందించేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నామని, రూ. 799 కోట్ల వాటర్ గ్రిడ్ ప్రతిపాదనలు రూపొందించినట్లు వెల్లడించారు. తాత్కాలిక, దీర్ఘకాలిక ప్రణాళికలను ప్రభుత్వానికి సమర్పించినట్లు, ప్రజా సమస్యల పరిష్కారానికే తమ కృషి కొనసాగుతుందని పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్