కర్నూలు జిల్లాలో స్పెషల్ కంట్రోల్ రూమ్ ప్రారంభం

8చూసినవారు
కర్నూలు జిల్లాలో స్పెషల్ కంట్రోల్ రూమ్ ప్రారంభం
కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యం, విద్య, సంక్షేమ వసతి గృహాలు, సమగ్ర శిశు అభివృద్ధి శాఖలకు సంబంధించిన వినతులు, ఫిర్యాదుల పరిష్కారానికి నూతనంగా ఏర్పాటు చేసిన స్పెషల్ కంట్రోల్ రూమ్‌ను బుధవారం జిల్లా కలెక్టర్ డా. ఏ. సిరి ప్రారంభించారు. ఈ కంప్లైంట్ సెల్ 24 గంటలు పనిచేస్తూ ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరిస్తుందని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ ద్వారా ఇప్పటివరకు వచ్చిన 109 కాల్స్‌లో 99 సమస్యలు పరిష్కారమయ్యాయని, పీహెచ్‌సీల్లో డాక్టర్ల హాజరును వీడియో కాల్స్ ద్వారా పర్యవేక్షిస్తున్నామని కలెక్టర్ వెల్లడించారు. కార్యక్రమంలో జిల్లా అధికారులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్