కర్నూలు నగరంలోని సుందరయ్య సర్కిల్‌ను తక్షణమే అభివృద్ధి చేసి ప్రజల ప్రాణాలను కాపాడాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు. 2010లో ఈ సర్కిల్‌కు స్వాతంత్ర సమరయోధుడు పుచ్చలపల్లి సుందరయ్య పేరు పెట్టాలని కౌన్సిల్ ఏకగ్రీవంగా తీర్మానించినప్పటికీ, ఇప్పటి వరకు అభివృద్ధి పనులు చేపట్టలేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కొత్త బస్టాండ్ నుండి రైల్వే స్టేషన్‌కు వెళ్లే ప్రధాన రహదారిపై ఉన్న ఈ సర్కిల్ అభివృద్ధి ప్రజల భద్రతకు అత్యవసరమని వారు పేర్కొన్నారు.