కర్నూలులో నేడు, రేపు ఎస్‌ఆర్‌ఎస్ మేళా సద్వినియోగం చేసుకోవాలి

2చూసినవారు
కర్నూలులో నేడు, రేపు ఎస్‌ఆర్‌ఎస్ మేళా సద్వినియోగం చేసుకోవాలి
కర్నూలు నగరంలో అనధికార లేఅవుట్ల క్రమబద్ధీకరణకు సంబంధించిన ఎల్‌ఆర్‌ఎస్ దరఖాస్తుల పరిశీలన, ప్రక్రియ పూర్తి చేసేందుకు నగరపాలక కమిషనర్ చల్లా ఓబులేసు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 7, 8 తేదీల్లో (గురు, శుక్రవారాల్లో) ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎస్‌ఆర్‌ఎస్ మేళా నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఎల్‌ఆర్‌ఎస్ పథకం కింద దరఖాస్తు చేసుకున్న వారు అవసరమైన పత్రాలతో హాజరై ప్రక్రియను పూర్తి చేసుకోవాలని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ కోరారు.

సంబంధిత పోస్ట్