కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షురాలు గుడిసె ఆది కృష్ణమ్మ బుధవారం కర్నూలులో డిఐజీ కోయ ప్రవీణ్ ను క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా కర్నూలు జిల్లా శాంతిభద్రతా పరిస్థితులు, ప్రజల సమస్యలు, పార్టీ కార్యక్రమాల సందర్భంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై చర్చించారు. ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, పోలీస్ శాఖతో సమన్వయంతో పనిచేయాలనే బాధ్యతను గుర్తు చేశారు.