కర్నూలు నగరంలో ఆదివారం జెడ్పీ సమావేశం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. అలగనూరు రిజర్వాయర్‌కు నిధులు కేటాయించాలని డిమాండ్ చేస్తూ సీపీఐ ఆధ్వర్యంలో కార్యకర్తలు సమావేశాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పోలీసులు గేట్లు మూసివేయగా, ఆగ్రహించిన కార్యకర్తలు గేట్లు తోసుకొని లోపలికి ప్రవేశించి, సమావేశ హాల్ వద్ద బైఠాయించి నిరసన వ్యక్తం చేశారు.