కర్నూలు కలెక్టర్ ఏ.సిరి మంగళవారం కోడుమూరులోని మహిళా సాంఘిక సంక్షేమ హాస్టల్ను సందర్శించి, విద్యార్థినులకు విద్యపై మార్గదర్శకత్వం అందించారు. చదువులో మెళకువలు, సమయపాలన ప్రాముఖ్యతను వివరించి, కష్టపడి చదివి మంచి పేరు తెచ్చుకోవాలని ప్రోత్సహించారు. హాస్టల్లో సమస్యలుంటే తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు.