కర్నూలు జిల్లా తుగ్గలి మండలంలో రాంపల్లి ఎక్స్ రోడ్డు అనే ఊరికి అధికారికంగా పేరే లేదు. 18 ఏళ్ల క్రితం పొలాలకు వెళ్లే రైతులు రవాణా సౌకర్యం లేక ఇక్కడే ఇళ్లు కట్టుకున్నారు. ప్రస్తుతం 52 ఇళ్లు ఉన్న ఈ గ్రామం వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తోంది. అయితే, వీరి ఓటర్, రేషన్ కార్డుల్లో చిరునామా ఇంకా రాంపల్లి గ్రామస్థులుగానే ఉంది. చెన్నంపల్లి రెవెన్యూ డివిజన్ పరిధిలో ఉన్న ఈ ప్రాంతం, జొన్నగిరి ఠాణా పరిధిలోకి వస్తుంది. దీంతో ఏదైనా గొడవ జరిగితే ఏ ఠాణాకు వెళ్లాలో తెలియని పరిస్థితి నెలకొంది. గ్రామంలో పాఠశాల లేకపోవడంతో పిల్లలు 2 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వస్తోంది.