ఆంధ్రప్రదేశ్‌లోని కర్నూలు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మిగతా జిల్లాల్లోనూ తేలికపాటి వర్షాలు పడే అవకాశం ఉంది. తెలంగాణలో కూడా అక్కడక్కడ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని IMD పేర్కొంది. నిన్న తెలుగు రాష్ట్రాల్లో పలు చోట్ల భారీ వర్షాలు నమోదయ్యాయి. ముఖ్యంగా యాదాద్రిలోని చౌటుప్పల్లో 6.1cm, నిజామాబాద్‌లోని మంచిప్పలో 5.4cmల వర్షపాతం నమోదైంది.